1 నుండి  3వరకు ఇవ్వబడిన Points పూర్తిగా అర్థమయ్యేంతవరకు ఓపిగ్గా  చదవడానికి ప్రయత్నించండి.

 

Point No .1

Passive Voice నేర్చుకునే ముందు టెన్సెస్ గురించి తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక సెంటెన్స్ లో వున్న verb ని చూడగానే అది ఏ Tense లో వుందో చెప్పగలగాలి.Tenses చాప్టర్ పూర్తిగా చదవకుండా దయచేసి ఈ Tenses Passive voice చదవకండి. Tenses Passive voice నేర్చుకోవడం మరియు మాట్లాడటం అన్నిటికంటే చాలా సులబం.

ఒక వాక్యంలో మూడు భాగాలు ఉంటాయి అవి:

1.Subject 2.verb  3.Object

Subject: వాక్యంలో పనిచేస్తున్న వ్యక్తిని సబ్జెక్టు అంటారు.

verb: వాక్యంలో పనిని సూచించే క్రియా పదం. verb లేకుండా సెంటెన్స్ వుండదు 

Object: సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతున్న దానిని ఆబ్జెక్ట్ అంటారు.

క్రింద మూడు ఉదాహరణలు ఇచ్చినాము వీటిని కొంచెం  నిదానంగా చదవండి.

Example 1:

1.Ravi eats Mango =రవి మామిడిపండును తింటాడు

Subject= Ravi “రవి మామిడిపండును తింటున్నాడు అనగా ఇక్కడ రవి పని చేస్తున్నాడు కాబట్టి సబ్జెక్టు అవుతాడు”

Verb = Eats “తినడం”

Object = Mango “మామిడిపండు రవి యొక్క ప్రభావానికి గురి అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ Mango ఆబ్జెక్ట్ అవుతుంది”

Example 2:

2.The boy kicks the ball. “ పిల్లవాడు బంతిని తన్నుతాడు”

Subject= The Boy “పిల్ల వాడు బంతిని తన్నుతున్నాడు అనగా పిల్లవాడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సబ్జెక్టు అవుతాడు”

Verb = Kicks “తన్నడం”

Object = The ball “బాలు పిల్లవాడి యొక్క ప్రభావానికి గురి అవుతున్నది లేదా శిక్షకు గురి అవుతున్నది కాబట్టి ఇక్కడ Ball ఆబ్జెక్ట్ అవుతుంది”.

Example 3:

3. Ramana drives a car “రమణ కారు నడుపుతాడు”

Subject= Ramana “రమణ  కారు నడుపుతున్నాడు అనగా పనిచేస్తున్నాడు కాబట్టి రమణ సబ్జెక్ట్ అవుతాడు”

Verb = Drives “ కారు నడపడం”

Object = The Car “కారు సబ్జెక్టు అయిన రమణ యొక్క ప్రభావానికి గురి అవుతున్నది కాబట్టి ఇక్కడ Car ఆబ్జెక్ట్ అవుతుంది”

క్రింది సెంటెన్స్ ని కూడా గమనించండి

Ramu sends  Ramesh = రాము రమేష్ ని పంపిస్తాడు.

(Ramu) Subject + (Sends) verb + (Ramesh) object  ఇక్కడ subject తో వాక్యం ప్రారంబం అయినది కాబట్టి  ఇది యాక్టివ్ వాయిస్ లో వుంది. టెన్సెస్ గురించి నేర్చుకున్నదంతా కూడా కేవలం యాక్టివ్ వాయిస్ లోనే. Active voice లో వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమై ఆబ్జెక్టుతో ముగించబడుతుంది. కానీ ప్యాసివ్ వాయిస్ లో వాక్యం ఆబ్జెక్టుతో ప్రారంభమై సబ్జెక్టుతో ముగించబడుతుంది.

Object + Verb + Subject  (Passive voice)

పైన కనిపిస్తున్న వాక్యాన్ని అర్దం చెడిపోకుండా object తో ప్రారంబించి చెప్పాలనుకుంటే

“రమేశ్ రాముని చేత పంపబడతాడు”. అని చెప్పాలి.

పైన కనిపిస్తున్న “చేత” అనే పదాన్ని ఇంగ్లిష్ లో “By” అంటారు. ఇప్పుడు three points గుర్తుంచుకోండి.

1.ప్రతి passive voice సెంటెన్స్ లో “By” అనే ప్రిపోజిషన్ వుంటుంది.

2.Passive voice లో present, past, future అన్ని Tenses లలో subject singular అయిన లేదా Plural అయిన కేవలం verb3 మాత్రమే ఉపయోగిస్తారు.

3.ప్రతి Passive voice సెంటెన్స్ లో ఒక Beform ఖచ్చితంగా వుంటుంది. 

Beforms: am, is, are, was, were, be, been, being.    వీటిని Be forms  అంటారు.

ప్రతి passive voice sentence లో

1.By

2.Be form

3.verb3

ఈ మూడు   ఖచ్చితంగా వుంటాయి . ఈ మూడింటి లో ఏది లేకపోయిన అది నూటికి నూరుశాతం passive voice కాదు.

ఇప్పుడు మార్పు చేసిన క్రింది ఉన్న ప్యాసివ్ వాయిస్ structure  గమనించండి.

Object + be from + verb3 + by+ Subject

ఈ స్ట్రక్చర్ ని కంఠోపాఠం చేయండి.

ఈ స్ట్రక్చర్ ప్రకారం పై వాక్యాన్ని రాస్తే

Ramesh is sent by Ramu = రమేశ్ రాము చేత పంపబడతాడు.

  1. Object = Ramesh (యాక్టీవ్ వాయిస్ లో ఉన్న ఆబ్జెక్ట్ తో sentence ప్రారంబించడం జరిగింది)
  2. Beform=is ( పైన ఇవ్వబడిన ‘Ramu sends  Ramesh’   అనే వాక్యం లోని verb   “sends”  అనేది verb  మొదటి రూపంలో ఉంది. అనగా ఈ వాక్యం  సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. Present tense కు  సంబంధించిన  బిఫామ్స్   am, is, are.    అయితే మన వాక్యంలో సబ్జెక్ట్ అయిన రమేష్ singular  కాబట్టి is ని ఉపయోగించడం జరిగింది)
  3. verb3 = Sent  (send యొక్క మూవడవ రూపం sent. అది ఏ Tense అయిన  ప్రతి  ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా verb3 ఉపయోగిస్తారు)
  4. By= చేత (ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా   by ఉంటుంది)
  5. Subject = Ramu (యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు ఇక్కడ చివరిలో రాయడం జరిగింది)

Passive voice లో Be form  ఒక్కటి మాత్రమేTense  ను బట్టి మారుతూ ఉంటుంది.

ఒక్కొక్క టెన్స్ లో singular  సబ్జెక్టుకు ఒకరకంగా, plural సబ్జెక్టుకు మరొక  రకంగా be form మారుతూ ఉంటుంది.

మిగతా  verb3, by, ప్రతి టెన్స్ లో కూడా మార్పు లేకుండా ఉంటాయి.

 

Passive voice  లో వ్యతిరేక వాక్యాలను రాయడం చాలా సులభం. Passive voice  లో ప్రతి Tense లో కూడా అది  singular సబ్జెక్ట్ అయినా Plural సబ్జెక్ట్ అయినా అన్నిటికి కామన్ గా Be form తరువాత Not ఉపయోగించి వ్యతిరేక వాక్యాలు రాస్తారు.

.Ramesh is sent by Ramu. (PS)

ఈ వాక్యాన్ని వ్యతిరేక వాక్యం గా రాయుటకు beform పక్కనే not ఉంచితే సరిపోతుంది.

Ramesh is not sent by Ramu (NS)

పై  రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా ( interrogative sentences) మార్చుటకు  be form అయిన is ని  object కి ముందు ఉంచితే సరిపోతుంది.

Is Ramesh sent by Ramu (IS)

Is Ramesh not sent by Ramu (NIS)

పై నాలుగు వాక్యాలను వరుసగా రాద్దాము.

Ramesh is sent by Ramu. (Positive sentence) రమేష్ ని రాము పంపిస్తాడు
Ramesh is not sent by Ramu (Negative sentence) రమేష్ ని రాము పంపడు
Is Ramesh sent by Ramu (Interrogative sentence) రమేష్ ని రాము పంపిస్తాడా?
Is Ramesh not sent by Ramu (Negative Interrogative Sentence) రమేష్ ని రాము పంపించడా?

 

Point :2

Active voice లో వున్న helping verbs అన్నీ Passive voice లో ఏ విధంగా మారుతాయో క్రింది పట్టిక ద్వారా గమనించండి.

Simple Present
Subject Active voice Pasive voice
I Do am
He/She/It Does is
We/You/They Do are

 

 Present Continuous
Subject Active voice Pasive voice
I am am being
He/She/It is is being
We/You/They are are being

 

Present Perfect
Subject Active voice Pasive voice
He/She/It Has has been
I/We/You/They have have been

 

Simple Past
Subject Active voice Pasive voice
I/He/She/It did was
We/You/They did were

 

Past Continuous
Subject Active voice Pasive voice
I/He/She/It was was being
We/You/They were were being

 

Past Perfect
Subject Active voice Pasive voice
All subjects Had had been

 

 

Simple Future
Subject Active voice Pasive voice
All subjects will will be

 

Future Perfect
Subject Active voice Pasive voice
All subjects will have will have been

 

క్రింది టెన్స్ కి Passive voice ఉండదు  ఎందుకనగా పాసివ్ వాయిస్ లో  ఉపయోగించాల్సిన be forms  ని యాక్టివ్ వాయిస్ లోనే ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు ప్యాసివ్ వాయిస్ లో అదనంగా Be forms  ని add చేయడం వలన గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది కాబట్టి ఈ టెన్సెస్ కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. Tenses chapter లో గమనించండి. 

Present perfect continuous tense Have been, has been
Past perfect continuous tense Had been
Future perfect continuous tense Will have been
Future continuous tense will be

been, be వీటిని acitve voice లోనే ఉపయోగించడం జరుగుతుంది.

 

Active voice లో ఉన్న సబ్జెక్టు Passive voice లో ఏ విధంగా మారుతుందో క్రింది పట్టిక ద్వారా గమనించండి. మరియు ఈ టేబుల్ని పూర్తిగా నేర్చుకోండి.

Active voice Passive voice
I me
we us
You you
They Them
He him
She her
It It
Ramesh Ramesh
Sunil Sunil

 

యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న “I ”  పాసివ్  వాయిస్ లో me గా మారుతుంది, ఒకవేళ యాక్టివ్ వాయిస్ లోనే me ఉన్నట్లయితే అది   పాసివ్ వాయిస్ లో “I ”  గా మారుతుంది.

యాక్టివ్ వాయిస్ లో we  గా ఉన్న సబ్జెక్టు,  పాసివ్  వాయిస్ లో us  గా మారుతుంది. అలాగే మిగతావి కూడా చదవండి. Active voice లో ఏమైనా పేర్లు వుంటే అవి Passive voice లో కూడా మార్పు లేకుండా పేర్లు గానే వుంటాయి.

Example:

Ramesh  asks them (Ramesh does ask them) =రమేశ్ వారిని అడుగుతాడు .

Subject (Ramesh) + verb  (asks) + Object (them)

పై active voice సెంటెన్స్ ని Passive voice లోకి మార్చుటకు object తో వాక్యాన్ని ప్రారంబించాలి 

Object+Be form + verb3 + by + Subject

They are asked by Ramesh (వారిని రమేశ్ అడుగుతాడు లేదా వారు రమేశ్ చేత అడగబడతారు)

Object = They ( active voice లో వున్న them ఇక్కడ they గా మారింది)

Be form =are (“they”  plural కాబట్టి “are” వుపయోగించారు.)

Verb = asked (ప్రతి passive voice sentence లో verb3 కామన్ గా వుంటుంది. Verb1  ఇక్కడ verb3 గా మారింది.)

By = (ప్రతి passive voice sentence లో “by = చేత ” కామన్ గా వుంటుంది.)

Subject=(active voice లో ప్రారంబంలో వున్న subject passive voice లో చివరలో వుంది)

పై Passive voice sentence ని ఒకసారి గమనించండి.

They are asked by Ramesh దీని తెలుగు అర్దం  ప్రదానంగా రెండు రకాలుగా చెబుతారు.

1.వారు రమేశ్ చేత అడగబడతారు

2.వారిని రమేశ్ అడుగుతాడు.

పై రెండింటిలో 1వ వాక్యం  ఇంగ్లిష్ వాక్యాన్ని తెలుగులోనికి తర్జుమా చేస్తే వచ్చే అర్దం. కానీ దీనిని వాడుకబాషలో ఉపయోగించరు.

2వ వాక్యం వాడుకబాషలో విరివిగా వుపయోగిస్తారు కనుక మీరు రెండవ అర్దాన్ని ఎక్కువగా ఉపయోగించండి.

Point :3

సాదారణంగా Passive voice లోobject తో వాక్యాన్ని ప్రారంబించేటప్పుడు  object కి చివర “ని,ను,కి,కు మనకి కనిపిస్తాయి.

ఈ విషయం క్రింది Table ద్వారా గమనించండి.

Active voice Passive  voice
She writes a letter to her friend.

ఆమె తన స్నేహితురాలికి ఒక లేఖ రాస్తుంది.

A letter is written to her friend by her.

లేఖని ఆమె తన స్నేహితురాలికి రాస్తుంది

They are watching a movie now.

వారు ఇప్పుడు సినిమా చూస్తున్నారు.

A movie is being watched by them now.

సినిమాని వారు ఇప్పుడు చూస్తున్నారు

He has cleaned the room already.

అతను ఇప్పటికే గదిని శుభ్రం చేశాడు.

The room has been cleaned by him already.

గదిని  అతను ఇప్పటికే శుభ్రం చేశాడు

They are watching a movie now.

వాళ్ళు ఇప్పుడు సినిమా చూస్తున్నారు.

A movie is being watched by them now.

సినిమాను వారు ఇప్పుడు చూస్తున్నారు

She was cooking dinner when I came.

నేను వచ్చేసరికి ఆమె భోజనం వండుతోంది.

Dinner was being cooked by her when I came.

భోజనమును మేము వచ్చేసరికి ఆమె వండుతూ ఉంది

Ramesh gave 100 Rupees to Sujatha

రమేష్ సుజాతకు 100 రూపాయలు ఇచ్చాడు

100 Rupees were given to Sujatha by Ramesh.

సుజాతకి రమేష్ వంద రూపాయలు ఇచ్చాడు

I went to Hyderabad last year

నేను గత సంవత్సరం హైదరాబాద్ వెళ్ళాను

Hyderabad was gone to by me last year.

హైదరాబాద్ కి నేను గత సంవత్సరం వెళ్లాను

I told them to come to my house.

వారిని నా ఇంటికి రమ్మని చెప్పాను.

They were told by me to come to my house.

వారికి నా ఇంటికి రమ్మని చెప్పాను

We will go to the market tomorrow.

మనం రేపు మార్కెట్ కు వెళ్తాము.

The market will be gone to by us tomorrow.

మార్కెట్ కు రేపు మనము వెళ్తాము

 

దీనిని బట్టి Subject అనేవాడు,  Object  గా ఉన్న నన్ను, నిన్ను, ఆమెని, వారిని, అతనిని, దానిని, అతనికి, ఆమెకి, దానికి, మాకు, మనకు ఏదో ఒకటి చేస్తాడు. దీనినే ప్యాసివ్ వాయిస్ అంటారు.

 

 

ఒక వాక్యంలో Object  ఉన్నప్పుడే  subject   అనేవాడు object  ని ఏదో ఒకటి చేస్తాడు.   ఒకవేళ ఆ సెంటెన్స్ లో  object  లేకపోతే subject అనే వాడు అక్కడ ఎవరిని ఏమి చేయలేడు.  కాబట్టి  ఆ సెంటెన్స్ కి ప్యాసివ్ వాయిస్ లేదు అని అర్థం

దయచేసి Tenses  గురించి సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాతనే Tenses  ప్యాసివ్ వాయిస్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. టెన్సెస్ కంటే Tenses  Passive Voice చాలా సులభం ?.

 

అసలు యాక్టివ్ వాయిస్ ఉండగా పాసివ్ వాయిస్ ఎందుకు?.

 A.ఉద్దేశపూర్వకముగా సబ్జెక్టుకున్న ప్రాధాన్యతను తగ్గించడమే ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఉదాహరణకు

Ramu murdered Sujata. (Active  voice)

రాము సుజాతని హత్య చేసినాడు

పై వాక్యంలో

Ramu (subject) murdered (verb) Sujata (object)

పని చేసిన వాడు సబ్జెక్ట్ అయితే, ఫలితాన్ని పొందినవాడు ఆబ్జెక్ట్.

Active voice పనిచేసిన వాడి పేరు మొదట చెబుతుంది వాడినే సబ్జెక్ట్ అంటారు.  ఆ ఫలితాన్ని పొందిన వాడి పేరు చివరలో చెబుతుంది వాడినే ఆబ్జెక్ట్ అంటారు .

అయితే  సెంటెన్స్ లో ఎవరి పేరు మొదటిగా చెప్పబడుతుందో ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్దం .

అయితే కొన్ని సందర్భాల్లో సబ్జెక్టుకి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యతను తగ్గించడమే పాసివ్ వాయిస్ యొక్క ముఖ్య లక్ష్యం. అందుకని సెంటెన్స్ ప్రారంభంలో సబ్జెక్టు పేరు మొదట ఉచ్చరించకుండా ఆబ్జెక్ట్ యొక్క పేరు మొదట ఉచ్చరించబడుతుంది.ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి అనుకుంటే కచ్చితంగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాలి.

ఇక్కడ రాము సుజాతని హత్య చేసినాడు. వాడు చేసినది చెడ్డ పని. రాము పేరుని మొదట ఉచ్చరించి వాడికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది పాసివ్ వాయిస్ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ సబ్జెక్టు పేరుని మొదట ఉచ్చరించకుండా ఆబ్జెక్ట్ పేరుని మొదట ఉచ్చరించాలి.ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలంటే కచ్చితంగా ప్యాసివ్  వాయిస్ ని ఉపయోగించాలి

Object + be + verb3 + by + Subject  (PV)

Sujatha was murdered by Ramu. (PV)

 

1.object  (sujatha)  పైన యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్న సుజాత తో వాక్యం ప్రారంబించడం జరిగినది .

2.Was (be form) పైన యాక్టివ్ వాయిస్ లో ఉన్నRamu murdered Sujata.అనే వాక్యం verb2 సింపుల్ ఫాస్ట్  లో ఉంది అని అర్థమవుతుంది.  కాబట్టి పాస్ట్ టెన్స్  కి సంబంధించిన be forms  was, were. మనం రాసిన ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో సుజాత అనే సబ్జెక్టు సింగులర్ కాబట్టి was అనే be form  ఉపయోగించాము.

3.Verb3 = murdered  (ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో verb3  కామన్ గా ఉపయోగించబడుతుంది.

4.By=  ప్రతి ప్యాసివ్  వాయిస్ సెంటెన్స్ లో  by అనే proposition కామన్ గా ఉపయోగించబడుతుంది

5.Subject (Ramu) Active voice లో సబ్జెక్టుగా ఉన్న రాము చివరిలో రాయడం జరిగినది .

 

B.కొన్ని సందర్భాలలో సబ్జెక్టు కంటే ఆబ్జెక్టుకి ప్రాధాన్యత ఇచ్చి చెప్పాల్సి ఉంటుంది.

ఉదాహరణకు   సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్ పేరుగాంచిన వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి అయినప్పుడు

1.The security personnel brought the Prime Minister safely. (AV)

భద్రతా సిబ్బంది ప్రధానిని సురక్షితంగా తీసుకొచ్చారు.ఇది ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్.

Subject: The security personnel

Verb: brought

Object: The Prime Minister

ఈ వాక్యంలో సెక్యూరిటీ సిబ్బంది యొక్క పేరును మొదటిగా చెప్పడం వలన సెక్యూరిటీ సిబ్బందికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్టు కనబడుతుంది. యాక్టీవ్ వాయిస్ ఎప్పుడూ కూడా గొప్పవాడు తక్కువ వాడు అనే భేదం లేకుండా పని చేసిన వాడికి మొదటి ప్రాధాన్యతనిచ్చి సబ్జెక్టుతోనే వాక్యాన్ని ప్రారంభిస్తుంది.

కానీ ప్రధానమంత్రి సెక్యూరిటీ సిబ్బంది కంటే గొప్పవాడు కాబట్టి,  ఆబ్జెక్టుగా ఉన్న ప్రధానమంత్రి పేరుతో వాక్యాన్ని ప్రారంభించాలి. ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే తప్పనిసరిగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాలి.

 

The security personnel brought the Prime Minister safely.(AV)

భద్రతా సిబ్బంది ప్రధానమంత్రిని సురక్షితంగా తీసుకువచ్చారు.

The Prime Minister was brought safely by the security personnel. (PV)

ప్రధానమంత్రిని భద్రతా సిబ్బంది  సురక్షితంగా తీసుకువచ్చారు.

పాసివ్ వాయిస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సబ్జెక్టుకు ప్రాధాన్యత లేకుండా చేయడమే. అలాంటప్పుడు      ‘ by ‘ ఉపయోగించి మరల పనిచేసిన వ్యక్తి పేరును  (subject) సూచించడం వలన ఆబ్జెక్టుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది.  కాబట్టి ఇంగ్లీషులో by  ఉపయోగించి పనిచేసిన వ్యక్తి పేరును అవసరమైతేనే చెబుతారు లేకుంటే చెప్పరు. passive voice లో  మాట్లాడేటప్పుడు 70 శాతం by  ఉపయోగించకుండానే మాట్లాడతారు. పై వాక్యంలో by తీసివేస్తే 

The Prime Minister was brought safely . (PV)

ప్రధానమంత్రిని   సురక్షితంగా తీసుకువచ్చారు.

2.Books are sold here (ఇక్కడ పుస్తకాలు అమ్మబడును)

ఇది ఒక ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. పుస్తకాలు అమ్మే ఒక షాపు యజమాని తన షాపు  ముందు ‘Books are sold here’  అని బోర్డు పెట్టాడు.

పై వాక్యాన్ని Acitve voice  సెంటెన్స్ లో రాస్తే

‘I sell books here’ ( నేను ఇక్కడ పుస్తకాలు అమ్ముతాను)

సెంటెన్స్ ప్రారంభంలో నేను అని సంబోధించడం వలన షాపు యజమానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుంది. అతని గురించి అందరికీ తెలియకపోవచ్చు గాని పుస్తకాలు మాత్రం అందరికీ తెలుసు కాబట్టి అతనికి అంటే  పుస్తకాలకు సమాజంలో ఎక్కువ పేరు ఉంది. ఇక్కడ సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్ గొప్పగా కనబడుతుంది. కాబట్టి ఆబ్జెక్టుతోనే వాక్యాన్ని ప్రారంభించాలి. ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే కచ్చితంగా Passive voice  ని ఉపయోగించాలి. పై వాక్యాన్ని పాసివ్ వాయిస్ లో రాస్తే

Books are sold here by me. ( ఇక్కడ పుస్తకాలు నా చేత అమ్మబడును)

ఇక్కడ ‘by me’  ఉపయోగించడం వలన మరల ప్రాధాన్యత సబ్జెక్టుకి వెళ్లిపోతుంది. ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆబ్జెక్టుకు ప్రాధాన్యత కలిగించడమే.  ఇంగ్లీషులో అవసరమైతేనే తప్ప ‘by’ ఉపయోగించి సబ్జెక్టు యొక్క పేరు చెప్పరు. కాబట్టి పై వాక్యాన్ని సింపుల్ గా క్రింది విధంగా  రాస్తే సరిపోతుంది.

Books are sold here. (పుస్తకాలు ఇక్కడ అమ్మబడును లేదా పుస్తకాలను  ఇక్కడ అమ్ముతారు)

పై రెండు ఉదాహరణలను బట్టి సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్   ప్రధానమైనది లేదా ముఖ్యమైనది అయినప్పుడు ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి అని అర్దం అవుతుంది. ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే కచ్చితంగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాలి అని మనకి అర్థం అవుతుంది.

పైన కనిపిస్తున్న are అనే be form ఎలా వచ్చింది. verb 3 అయిన sold ఎలా వచ్చింది. అనే విషయాలు క్రింది లెసన్స్ లో మీకు పూర్తిగా అర్దం అవుతాయి.

C.పనిచేసిన సబ్జెక్టు ఎవరో తెలియనప్పుడు ఆబ్జెక్ట్ కు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతారు

పనిచేసిన వ్యక్తి ఎవరో తెలియనప్పుడు చేసిన పనిని గురించి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో కచ్చితంగా పాసివ్ వాయిస్ ఉపయోగించాలి ఉదాహరణకు:

The book was left on the table by me. నాచేత పుస్తకం టేబుల్ పై ఉంచబడింది.

ఎవరి చేత పుస్తకం టేబుల్ పై ఉంచబడిందో తెలియకపోతే అనగా పనిచేసిన వ్యక్తి తెలియకపోతే “ by me”వాడవలసిన అవసరం లేదు. క్రింది ఉదాహరణలు గమనించండి. by ఉపయోగించి subject చెప్పకపోయిన అపనిని ఎవరో ఒకరు చేశారు, లేదా చేస్తారు, లేదా చేస్తున్నారు అని అర్దం వస్తుంది. కానీ ఎవరు చేస్తున్నారో  తెలియదు

1. The book was left on the table. 1. పుస్తకం టేబుల్‌పై ఉంచబడింది.లేక పుస్తకమును టేబుల్ పై ఉంచారు
2. The car was stolen last night. 2. నిన్న రాత్రి కారు దొంగిలించబడింది. లేక కారుని నిన్న రాత్రి దొంగిలించారు
3. A new mall was built in the city. 3. నగరంలో కొత్త మాల్ నిర్మించబడింది. లేక  క్రొత్త మాల్ ను నగరంలో నిర్మించారు
4. The lights were turned off during the meeting. 4. మీటింగ్ సమయంలో లైట్లు ఆఫ్ చేయబడ్డాయి. లేక లైట్లను మీటింగ్ సమయంలో ఆపివేశారు
5. The results were announced yesterday. 5. ఫలితాలు నిన్న ప్రకటించబడ్డాయి. లేక ఫలితాలను నిన్న ప్రకటించారు
6. A phone was found in the park. 6. పార్కులో ఫోన్ కనుగొన బడింది. లేక ఫోను పార్కులో దొరికింది.
7. The road was repaired last week. 7. రోడ్డు గత వారం మరమ్మత్తు చేయబడింది. లేక  రోడ్డును గత వారంమరమ్మత్తు చేశారు
8. Some papers were dropped in the hallway. 8. కొన్ని కాగితాలు హాలులో పడిపోయాయి. లేక కొన్ని కాగితాలను హాలులో పడవేశారు
9. The dishes were washed after dinner. 9. రాత్రి భోజనం తర్వాత పాత్రలు కడుగుతారు. లేక పాత్రలను  రాత్రి భోజనం తర్వాత కడుగుతారు
10. A chair was placed near the door. 10. తలుపు దగ్గర ఒక కుర్చీ ఉంచబడింది. లేక కుర్చీని తలుపు దగ్గర ఉంచినారు

 

D.చర్య యొక్క రిసీవర్ (object)ను  నొక్కి చెప్పడానికి.

 

పని చేసిన వాడికంటే ఫలితాన్ని పొందిన ఆబ్జెక్ట్ ని ప్రధానంగా హైలైట్ చేయాలని ఉద్దేశం.

Example: “The cake was eaten by the children.” కేకు పిల్లల చేత తినబడింది. ఇక్కడ ఫోకస్ అంతా కూడా కేక్ మీద ఉన్నది. గాని పిల్లల మీద లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మాట్లాడాలి అనుకున్నప్పుడు పాసివ్ వాయిస్ ని ఉపయోగిస్తారు.by ఉపయోగించి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ని చేర్చండి.

1 . The Eiffel Tower is visited by millions of tourists every year. 1 . ఈఫిల్ టవర్‌ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు చేత సందర్శించబడుతుంది.

ఈఫిల్ టవర్‌ను ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తారు.

3. The novel was written in just three months. 3. నవలను కేవలం మూడు నెలల్లో రాశారు. లేదా నవల కేవలం మూడు నెలల్లో వ్రాయబడింది.

 

4. The thief was caught by the police. 4. దొంగ పోలీసుల చేత పట్టుబడ్డాడు  . లేక దొంగను పోలీసులు పట్టుకున్నారు.
5. The proposal was rejected by the committee. 5. ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. ప్రతిపాదనను కమిటీ చేత తిరస్కరించ బడింది.
6. The patient was treated by the best doctors. 6. రోగిని  ఉత్తమ వైద్యులు చికిత్స చేశారు.
7. The house was decorated beautifully. 7. ఇల్లు అందంగా అలంకరించబడింది.లేదా ఇల్లును అందంగా అలంకరించారు.
8. The homework was submitted on time. 8. హోంవర్క్ సమయానికి సమర్పించబడింది. లేదా

హోంవర్క్ ను సమయానికి సమర్పించారు.

 

1.   యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి వాక్యాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే యాక్టివ్ వాయిస్ లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్  ఉండాలి. ఆబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలను పాసివ్ వాయిస్ లో అసలు చెప్పలేము.

ఆబ్జెక్ట్ ప్రధానంగా ఈ క్రింది లక్షణాలను కలిగి  ఉంటుంది.

1.సబ్జెక్టు యొక్క మాట వింటాడు.

2.సబ్జెక్టు విధించే శిక్షకు  గురి అవుతాడు

3.సబ్జెక్టు చెప్పిన పనిని ఆబ్జెక్ట్ చేస్తాడు.

4.సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతాడు.

 

సబ్జెక్టు నిరంతరం ప్రాణం లేని ఒక వస్తువునైనను, ప్రాణం ఉన్న ఒక జీవినైనను ఏదో ఒకటి చేస్తుంది.దానినే ఆబ్జెక్ట్ (object) అంటారు..

ఈ క్రింది Active Voice  సెంటెన్సెస్ ని గమనించండి.

  1. She baked a cake.

ఇక్కడ సబ్జెక్టు అయిన  she ప్రాణము లేనటువంటి ఒక కేక్ ని కాలుస్తుంది.కాబట్టి కేక్ ఆబ్జెక్ట్ అవుతుంది..

  1. They read the book.

ఇక్కడ సబ్జెక్టు అయినా they ప్రాణం లేని ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు.పుస్తకం సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ పుస్తకం ఆబ్జెక్ట్ అవుతుంది .

  1. The dog chased a ball.

ఇక్కడ సబ్జెక్టు అయిన ఒక dog ప్రాణం లేని ఒక బాల్ ని వెంబడించింది.ఇక్కడ బాల్ ఆబ్జెక్ట్ అవుతుంది

  1. She asked him.

ఇక్కడ సబ్జెక్టు అయిన she ప్రాణం ఉన్న ఒక వ్యక్తిని ఏదో అడిగింది. ఇక్కడ him ఆబ్జెక్ట్ అవుతుంది.

  1. He is sending them.

ఇక్కడ సబ్జెక్టు అయిన He ప్రాణం ఉన్న కొందరిని ఎక్కడికో పంపుతున్నాడు. ఇక్కడ them ఆబ్జెక్ట్ అవుతుంది.

 

ఈ విధంగా ప్రతి వాక్యంలో కూడా సబ్జెక్టు ప్రాణం లేని ఒక వస్తువును గానీ, ప్రాణం ఉన్నఒక జీవిని  గాని ఏదో ఒకటి చేస్తాడు. మొత్తం మీద సబ్జెక్టు యొక్క ప్రభావానికి ఆబ్జెక్ట్ గురి అవుతూ ఉంటుంది.

2. కొన్ని వాక్యాలలో  ఆబ్జెక్ట్ ఉండదు. అయినప్పటికీ ఆ వాక్యాలు పూర్తి అర్ధాన్ని ఇస్తాయి ఉదాహరణకు కింది వాక్యాలు గమనించండి.

  1. The stars shine brightly.(నక్షత్రాలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి)

ఇక్కడ stars సబ్జెక్టు, shine వెర్బ్ కానీ ఇక్కడ సబ్జెక్టు అయిన  స్టార్స్. దేనినైనను ఏమైనను చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ (object) లేదు అని చెప్పవచ్చు.

  1. Birds sing at dawn.(తెల్లవారుజామున పక్షులు పాడతాయి)

ఫ్రెండ్స్ ఇక్కడ Birds సబ్జెక్టు, sing వెర్బ్, ఇక్కడ సబ్జెక్టు అయిన Birds దేనినైనను, ఎవరినైనను, ఏమైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు.

  1. The river flows peacefully.(నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది.)

ఇక్కడ ఈ వాక్యంలో River సబ్జెక్టు,  flows వెర్బ్  ఇక్కడ సబ్జెక్టు అయిన River దేనినైనను ఎవరినైనను ఏదైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు.

  1. Clouds gather in silence.(మేఘాలు నిశ్శబ్దంగా గుమిగూడుతాయి).

ఇక్కడ clouds సబ్జెక్టు, gather వెర్బ్. కానీ సబ్జెక్టు అయిన clouds దేని నైనను, ఎవరినైనను ఏదైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు.

  1. Flowers bloom every spring..(ప్రతి వసంతకాలంలో పువ్వులు వికసిస్తాయి.)

ఇక్కడ flowers సబ్జెక్టు, bloom వెర్బ్. కానీ సబ్జెక్ట్ అయిన ఫ్లవర్స్ ఎవరినైనను దేనినైనను ఏదైనను చేస్తున్నట్లు కనిపించడం లేదు కనుక ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు.

object ఉన్న వాక్యాలను మాత్రమే పాసివ్ వాయిస్ లోనికి మార్చడానికి వీలవుతుంది. ఆబ్జెక్ట్ లేని వాక్యాలను పాసివ్ వాయిస్ లో చెప్పలేము.

 

3. ప్రతి వాక్యంలో కూడా సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆబ్జెక్ట్ కొన్ని వాక్యాలలో ఉండొచ్చు కొన్ని వాక్యాలలో ఉండకపోవచ్చు ఎటువంటి వాక్యాలలో ఆబ్జెక్ట్ ఉంటుంది ఎటువంటి వాక్యాలలో ఆబ్జెక్ట్  ఉండదు అనే విషయాలను గురించి తెలుసుకుందాం.

Transistive verbs ఉండే వాక్యాలకు మాత్రమే object ఉంటుంది.  Transistive verbs వుండే వాక్యాలలో object ఏదో చెప్పకపోతే ఆ వాక్యం పూర్తి కాదు. క్రిందిఉదాహరణలు గమనించండి.

 She ate an apple  for breakfast. ఆమె అల్పాహారం కోసం ఒక ఆపిల్ తిన్నది.
 I bought a new phone yesterday. నేను నిన్న కొత్త ఫోన్ కొన్నాను.
They made  a delicious cake for the party. వారు పార్టీ కోసం రుచికరమైన కేక్ తయారు చేశారు
 He sent  a letter to his friend. అతను తన స్నేహితుడికి ఒక లేఖ పంపాడు.
The teacher teaches  the students grammar. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధిస్తాడు
 She loves  her family deeply. ఆమె తన కుటుంబాన్ని గాఢంగా ప్రేమిస్తుంది.
 He reads  the newspaper every morning. అతను ప్రతి ఉదయం వార్తాపత్రిక చదువుతాడు.
 She writes  a letter to her grandmother every month. ఆమె ప్రతి నెలా తన అమ్మమ్మకి ఉత్తరం రాస్తుంది
I found  my keys on the kitchen counter. నేను వంటగది కౌంటర్‌లో నా కీలను కనుగొన్నాను
 They helped  their neighbor move into the new house. వారు తమ పొరుగువారికి కొత్త ఇంట్లోకి వెళ్లడానికి సహాయం చేసారు

 

పైన కనిపిస్తున్న పింక్ కలర్ లో కనిపిస్తున్న ఇటువంటి verbs నే transistive verbs  అని అంటారు.. ఉదాహరణకు Eat అనే verb  ని తీసుకుంటే దేనిని తిన్నాడో చెప్పకపోతే ఆ వాక్యం పూర్తికాదు. దేనిని తిన్నాడో అదే ఆబ్జెక్ట్ అవుతుంది.

రెండవ వాక్యాన్ని గమనిస్తే నేను నిన్న కొన్నాను. దేనిని కొన్నాడో ఆ object ని రాయకపోతే ఆ వాక్యం పూర్తి కాదు.

మిగతా వ్యాఖ్యలను కూడా గమనించండి.ఈ విధంగా Transistive verbs ఉండే వాక్యాలకు తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉంటుంది object లేకపోతే ఆ వాక్యం పూర్తి కాదు.

 ఆబ్జెక్ట్ ఉన్న వాక్యాలను మాత్రమే  ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చడానికి వీలవుతుంది