భవిష్యత్తును తెలియజేయడానికి ఉపయోగించే సహాయక క్రియ will

 be = ఉండు

Will be = ఉంటాడు, ఉంటుంది, ఉంటారు (భవిష్యత్తులో)

భవిష్యత్తులో సబ్జెక్టు యొక్క స్థితిని, ప్రదేశమును, వృత్తిని, భావాలను, సమయస్థితిని, మొదలైన వాటిని తెలియజేయడానికి will be ని  ఉపయోగిస్తారు. 

ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం

 

1. Profession: భవిష్యత్తులో సబ్జెక్టుకి ఉండేటువంటి వృత్తిని గురించి తెలియజేయడానికి will be ఉపయోగిస్తారు

He will be a Lawyer (Pasitive sentence)

అతను లాయర్ గా ఉంటాడు ( అంటే ఇప్పుడు లేడు అని అర్థం భవిష్యత్తులో లాయర్ గా ఉంటాడు) 

వ్యతిరేక వాక్యంగా మార్చుటకు will తరువాత not పెట్టాలి.

He will not be a Lawyer (Negative Sentence )

(అతను డాక్టర్ గా ఉండడు)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు will సెంటెన్స్ ప్రారంభంలో ఉంచాలి.

Will he be a Lawyer (Interrogative sentence)

అతను లాయర్ గా ఉంటాడా?

Will he not be a Lawyer (Negative interrogative sentences)

అతను లాయర్ గా ఉండడా?

Examples :

1. He will be a doctor. అతను డాక్టర్ అవుతాడు.(అతను డాక్టర్ గా ఉంటాడు.ఈ విధంగా రెండు  అర్థాలు ఉపయోగించుకోవచ్చు)
He will not be a doctor. అతను డాక్టర్ గా ఉండడు
Will he be a doctor? అతను డాక్టర్ గా ఉంటాడా?
Will he not be a doctor? అతను డాక్టర్ గా ఉండడా ?
   
2. She will be a teacher. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉంటుంది.
She will not be a teacher. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉండదు   
Will she be a teacher? ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉంటుందా?
Will she not be a teacher? ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉండదా?
   
3. I will be an engineer. నేను ఇంజనీర్ అవుతాను.(నేను ఇంజనీర్ గా ఉంటాను)
I will not be an engineer. నేను ఇంజనీర్ అవ్వను
Will I be an engineer? నేను ఇంజనీర్ అవుతానా?
Will I not be an engineer? నేను ఇంజనీర్ అవ్వనా?
   
4. We will be farmers. మేము రైతులుగా ఉంటాము
We will not be farmers. మేము రైతులుగా ఉండము
Will we be farmers? మేము రైతులుగా ఉంటామా ?
Will we not be farmers? మేము రైతులుగా ఉండమా ?
   
5. You will be a manager. మీరు మేనేజర్ గా ఉంటారు
You will not be a manager. మీరు మేనేజర్ గా ఉండరు 
Will you be a manager? మీరు మేనేజర్ గా ఉంటారా ?
Will you not be a manager? మీరు మేనేజర్ గా ఉండరా ?
   
6 . They will be nurses. వారు నర్సులుగా ఉంటారు (వారు నర్సులు అవుతారు.)
They will not be nurses. వారు నర్సులుగా ఉండరు
Will they be nurses? వారు నర్సులుగా ఉంటారా ?
Will they not be nurses? వారు నర్సులుగా ఉండరా ?
   
7. He will be a pilot. అతను పైలట్ గా ఉంటాడు (అతను పైలట్ అవుతాడు.)
He will not be a pilot. అతను పైలట్ గా ఉండడు 
Will he be a pilot? అతను పైలట్ గా ఉంటాడా? 
Will he not be a pilot? అతను పైలట్ గా ఉండడా?
   
8. She will be a lawyer. ఆమె న్యాయవాదిగా ఉంటుంది (ఆమె న్యాయవాది అవుతుంది)
She will not be a lawyer. ఆమె న్యాయవాదిగా ఉండదు
Will she be a lawyer? ఆమె న్యాయవాదిగా  ఉంటుందా ?
Will she not be a lawyer? ఆమె న్యాయవాదిగా ఉండదా?
   
9. I will be a writer. నేను రచయితగా ఉంటాను (నేను రచయిత అవుతాను.)
I will not be a writer. నేను రచయితగా ఉండను
Will I be a writer? నేను రచయితగా ఉంటానా ?
Will I not be a writer? నేను రచయితగా ఉండనా?
   
10. They will be actors. వారు నటులుగా ఉంటారు (వారు నటులు అవుతారు.)
They will not be actors. వారు నటులుగా ఉండరు
Will they be actors? వారు నటులుగా ఉంటారా ?
Will they not be actors? వారు నటులుగా ఉండరా?